సిద్దిపేటకు సీఎం కేసీఆర్ ‘వరాలు’..
దిశ, వెబ్‌డెస్క్ : సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో సిద్దిపేట కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ బిల్డింగ్, పలు భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సిద్దిపేట నేను పుట్టిన జిల్లా అని తెలిపారు. ఇప్పటికే ఈ జిల్లాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాం. ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో సిద్దిపేటకు వెటర్నరీ కాలేజీని మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో నాలుగు జిల్లాలో వెటర్నరీ […]
దిశ, వెబ్‌డెస్క్ : సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో సిద్దిపేట కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ బిల్డింగ్, పలు భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సిద్దిపేట నేను పుట్టిన జిల్లా అని తెలిపారు. ఇప్పటికే ఈ జిల్లాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాం. ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో సిద్దిపేటకు వెటర్నరీ కాలేజీని మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో నాలుగు జిల్లాలో వెటర్నరీ కాలేజీల ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. సిద్దిపేట, నల్గొండ, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు వెటర్నరీ కాలేజీలను మంజూరు చేస్తున్నట్టు సీఎం వెల్లడించారు.
గతంలో మంచినీటి కోసం చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రస్తుతం చెరువులన్నీ నిండి ఉన్నాయి. మే నెలలో కూడా చెరువులు అలుగు పారుతున్నాయి. ఇందుకోసమే తెలంగాణ కోరుకున్నామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ కోసం ఎన్నో కష్టాలు పడ్డాం. సమైఖ్య రాష్ట్రంలో కరెంట్ కోసం ఎన్నో కష్టాలు అనుభవించాం. ఓ సబ్‌స్టేషన్ కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చేదని కేసీఆర్ వెల్లడించారు. కరెంట్ విషయంలో ఎలాంటి బాధలు అనుభవించామో సిద్దిపేటవాసులకు ఎక్కువగా తెలుసని అన్నారు. తెలంగాణ రాకముందే మిషన్ కాకతీయకు రూపకల్పన చేసినట్టు తెలిపారు. మిషన్ కాకతీయ వల్ల నేడు చెరువులు నిండుగా ఉండి.. పంటలు బాగా పండుతున్నాయని అన్నారు.
వాక్‌శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధితోనే ఇదంతా సాధ్యమైందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో 3కోట్ల టన్నుల ధాన్యాన్ని ఉత్పతి చేస్తున్నాం. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ.. పంజాబ్‌ను అధిగమించిందని వెల్లడించారు.