ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై సీఎం కేసీఆర్ ఆగ్రహం
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో కరోనాపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మధ్య వాగ్వాదం జరిగింది. కరోనా వారియర్స్‌ను ప్రభుత్వం గుర్తించడం లేదని, మంత్రి ఈటల ప్రసంగం హెల్త‌్ బులెటిన్‌లా ఉందని, కొవిడ్ నిధికి విరాళాలు ఇచ్చినవారిని గుర్తించకపోవడం బాధాకరమని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించగా ఈ సందర్భంగా కల్పించుకున్న సీఎం కేసీఆర్ అక్బరుద్దీన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా నివారణకు మంత్రి ఈటల రాజేందర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని, ఎన్ని చర్యలు తీసుకున్నా […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో కరోనాపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మధ్య వాగ్వాదం జరిగింది. కరోనా వారియర్స్‌ను ప్రభుత్వం గుర్తించడం లేదని, మంత్రి ఈటల ప్రసంగం హెల్త‌్ బులెటిన్‌లా ఉందని, కొవిడ్ నిధికి విరాళాలు ఇచ్చినవారిని గుర్తించకపోవడం బాధాకరమని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించగా ఈ సందర్భంగా కల్పించుకున్న సీఎం కేసీఆర్ అక్బరుద్దీన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా నివారణకు మంత్రి ఈటల రాజేందర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని, ఎన్ని చర్యలు తీసుకున్నా రాష్ట్రంలో కరోనా ఇంకా తగ్గడం లేదని సీఎం తెలిపారు. ప్రభుత్వం నిత్యం చర్యలు తీసుకుంటుందని, వాటిని ప్రస్తుతం ప్రస్తావించడం సాధ్యం కాదని సీఎం అన్నారు. కరోనా యోధులకు వేతనాలు పెంచి ఇస్తున్నామన్న విషయాన్ని గుర్తు చేశారు. ధరణి పోర్టల్ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందన్న సీఎం… ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఉండదని స్పష్టం చేశారు.