పీఎం మోదికి సీఎం లేఖాస్త్రం..

దిశ, వెబ్ డెస్క్ : పెరుగుతున్న విద్యుత్ ధరలను తగ్గించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ కి లేఖ రాశారు. అలాగే ఇందన అవసరాలు పెరుగుతుండటంతో అదనంగా రాష్ట్రానికి ఇవ్వాలని కూడా లేఖలో కోరారు. కరోనాకు ముందు కంటే ప్రస్తుతం విద్యుత్ వినియోగం పెరిగిందని, డిమాండ్ పెరగడంతో ధర ఒక్కోసారి యూనిట్ కు 20 శాతానికి పైగా పెరుగుతుందని వివరించారు. ఆరు నెలల్లో విద్యుత్ వినియోగం 15 శాతం పెరిగిందని, కానీ ఇప్పుడు […]

Update: 2021-10-08 10:49 GMT

దిశ, వెబ్ డెస్క్ : పెరుగుతున్న విద్యుత్ ధరలను తగ్గించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ కి లేఖ రాశారు. అలాగే ఇందన అవసరాలు పెరుగుతుండటంతో అదనంగా రాష్ట్రానికి ఇవ్వాలని కూడా లేఖలో కోరారు. కరోనాకు ముందు కంటే ప్రస్తుతం విద్యుత్ వినియోగం పెరిగిందని, డిమాండ్ పెరగడంతో ధర ఒక్కోసారి యూనిట్ కు 20 శాతానికి పైగా పెరుగుతుందని వివరించారు. ఆరు నెలల్లో విద్యుత్ వినియోగం 15 శాతం పెరిగిందని, కానీ ఇప్పుడు కేవలం ఒక్క నెలలోనే 20 శాతం పెరగడం తో విద్యుత్ ఇబ్బందులు రావచ్చని కేంద్రం దీని పైన ఆలోచించాలని కోరారు.

రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసే థర్మల్ పవర్ ప్లాంట్ లకు 20 ర్యాక్ ల బొగ్గు కేటాయించాలని, పనిచేయని బొగ్గు ప్లాంట్ లను పునరుద్దరించాలని, దానితో పాటే విద్యుత్ డిస్కం లకు బ్యాంకుల ద్వారా రుణాలిప్పించాలి. ఓఎన్జీసీ, రిలయన్స్ లాంటి సంస్థల ద్వారా ఏపీకి యుద్దప్రాతిపాదికన గ్యాస్ సరాఫరా చేయాలి. మరో 500 ల మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని’ లేఖలో కేంద్రాన్ని కోరారు.

Tags:    

Similar News