అప్పుడే నా రచ్చబండ కార్యక్రమం: జగన్
దిశ, వెబ్‌డెస్క్: ప్రజలు పెట్టుకునే అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కారమవుతున్నాయా లేదా అన్నదాని పై కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ స్పందన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టాక రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు, పథకాలు అమలవుతున్న తీరును […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రజలు పెట్టుకునే అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కారమవుతున్నాయా లేదా అన్నదాని పై కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ స్పందన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టాక రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు, పథకాలు అమలవుతున్న తీరును స్వయంగా పరిశీలించేందుకు గ్రామాల్లో పర్యటిస్తానని వెల్లడించారు. స్పందన కార్యక్రమం ద్వారా ముఖ్యంగా రేషన్ కార్డు, పెన్షన్, హౌసింగ్ స్కీమ్స్ ను గ్రామ సెక్రటేరియట్ పరిధిలోనే పరిష్కరించాలన్నారు.
అప్పుడే అనుకున్న సమయానికి ప్రజలకు మేలు జరుగుతోందని సీఎం ఆకాంక్షించారు. గ్రామ సెక్రటేరియట్ పరిధిలో ఈ పనులు అనుకున్న టైమ్‌కు జరుగుతున్నాయో లేదో జిల్లా కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో తాను రచ్చబండ కార్యక్రమంలో పర్యటిస్తున్న సమయంలో ఇళ్లు లేదని ఎవరూ చేతి పైకెత్తకూడదని.. కచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందాలని ఆయన అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్న వారు లబ్ధి పొందలేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని సీఎం జగన్ అధికారులకు క్లారిటీ ఇచ్చారు.