మహిళా ఖైదీలకు సీఎం గుడ్ న్యూస్

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని జైళ్లల్లో మగ్గుతున్న మహిళా ఖైదీలను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని హోంమంత్రిమేకతోటి సుచరిత శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. జైళ్లల్లో ఐదేళ్లు శిక్ష పూర్తి చేసుకున్న మహిళా ఖైదీలందరినీ విడుదల చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. ప్రస్తుతం జైళ్లల్లో 147 మంది మహిళాలు జీవిత ఖైదీలుగా ఉండగా వారిలో 55 మంది విడుదలకు అర్హత కలిసి ఉన్నారని ప్రకటించారు. విడుదల అయిన ఖైదీలకు […]

Update: 2020-11-06 12:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని జైళ్లల్లో మగ్గుతున్న మహిళా ఖైదీలను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని హోంమంత్రిమేకతోటి సుచరిత శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. జైళ్లల్లో ఐదేళ్లు శిక్ష పూర్తి చేసుకున్న మహిళా ఖైదీలందరినీ విడుదల చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. ప్రస్తుతం జైళ్లల్లో 147 మంది మహిళాలు జీవిత ఖైదీలుగా ఉండగా వారిలో 55 మంది విడుదలకు అర్హత కలిసి ఉన్నారని ప్రకటించారు. విడుదల అయిన ఖైదీలకు ఉపాధి కల్పించేలా శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. తాను కడప, విశాఖపట్నం జైళ్లను సందర్శించినపుడు అక్కడి మహిళ ఖైదీల బాధలు విన్నానని, వారి అభ్యర్థనను ముఖ్యమంత్రి జగన్‌కు చెప్పగా.. ఆయన ఎంతో మంచి మనసుతో అంగీకరించారని హోం మంత్రి వెల్లడించారు. వారం రోజుల్లోపు వీరందరినీ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే పురుష ఖైదీల విడుదలకు సంబంధించి జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్ణయం తీసుకుంటామని హోం మంత్రి వెల్లడించారు. సీఎం తీసుకున్న నిర్ణయం దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోలేదని ఆమె తెలిపారు.

Tags:    

Similar News