కరోనా వారియర్లకు కేజ్రీవాల్ భరోసా.. రూ.కోటి చెక్కు అందజేత
దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా దేశ రాజధానిలో కరోనా కేసులు విలయతాండవం చేశాయి. ఆ మహమ్మారి నుంచి బాధితులను రక్షించేందుకు కరోనా వారియర్లు చూపించిన తెగువ మరువలేనిది. క్వారంటైన్‌లో ఉన్న రోగులకు చికిత్స అందించే క్రమంలో భాగంగా వైరస్ బారిన చాలా మంది కరోనా వారియర్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అలాంటి వారి కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం బాసటగా నిలిచింది. విధి నిర్వహణలో వైరస్ […]
దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా దేశ రాజధానిలో కరోనా కేసులు విలయతాండవం చేశాయి. ఆ మహమ్మారి నుంచి బాధితులను రక్షించేందుకు కరోనా వారియర్లు చూపించిన తెగువ మరువలేనిది. క్వారంటైన్‌లో ఉన్న రోగులకు చికిత్స అందించే క్రమంలో భాగంగా వైరస్ బారిన చాలా మంది కరోనా వారియర్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అలాంటి వారి కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం బాసటగా నిలిచింది. విధి నిర్వహణలో వైరస్ బారిన పడి మృతి చెందిన నర్సులు, ల్యాబ్ టెక్నిషన్లు, వైద్య సిబ్బంది కుటుంబాలకు రూ.1కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు ఇటీవల ప్రకటించారు.
అందులో భాగంగానే ల్యాబ్ టెక్నిషియన్ రాకేష్ జైన్ ఫ్యామిలీకి శనివారం రూ. కోటి చెక్కు అందజేశారు. మృతుడు ఢిల్లీలోని హిందురావ్ హాస్పిటల్‌లో కరోనా వారియర్‌గా విధులు నిర్వర్తిస్తూ వైరస్ బారిన పడి తనువు చాలించాడు.
Delhi Chief Minister Arvind Kejriwal met and gave Rs 1 crore relief amount to the family of Rakesh Jain, Lab technician at Hindu Rao Hospital, who lost his life in the line of #COVID19 duty. pic.twitter.com/RD4WrFBppo
— ANI (@ANI) March 13, 2021