ప్రభుత్వంపై మరో ఉద్యమం.. అమ్మకాలు వద్దని భట్టి వార్నింగ్

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రాన్ని దివాలా తీసేలా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ప్రభుత్వ భూముల అమ్మకాలపైన సీఎల్పీ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ప్రజల అవసరాల కోసమే ఆస్తులు ఉండాలి కానీ, అమ్మకానికి కాదంటూ ప్రభుత్వానికి కౌంటర్ వేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కూడా ప్రభుత్వ ఆస్తులను కాపాడటం కోసమే అంటూ మరోసారి గుర్తు చేశారు. అధికారంలోకి రాకముందు ప్రభుత్వ భూముల అమ్మకాలను వ్యతిరేకించిన టీఆర్ఎస్.. […]

Update: 2021-06-13 07:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రాన్ని దివాలా తీసేలా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ప్రభుత్వ భూముల అమ్మకాలపైన సీఎల్పీ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ప్రజల అవసరాల కోసమే ఆస్తులు ఉండాలి కానీ, అమ్మకానికి కాదంటూ ప్రభుత్వానికి కౌంటర్ వేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కూడా ప్రభుత్వ ఆస్తులను కాపాడటం కోసమే అంటూ మరోసారి గుర్తు చేశారు. అధికారంలోకి రాకముందు ప్రభుత్వ భూముల అమ్మకాలను వ్యతిరేకించిన టీఆర్ఎస్.. ఇప్పుడు అమ్మకాలను ఎలా ఎంకరేజ్ చేస్తుందని ప్రశ్నించారు భట్టి. వెంటనే ప్రభుత్వ భూముల అమ్మకాలను నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని.. అమ్మకానికి పెట్టిన భూములు, అప్పుల వివరాలను తెలంగాణ ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. మొండి వైఖరితో అమ్మకాలు చేస్తే వేలాన్ని అడ్డుకుంటామని భట్టి హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ భూముల అమ్మకాలను ఆపేలా గవర్నర్‌ను కోరేందుకు సీఎల్పీ నిర్ణయం తీసుకుంది. వర్చువల్‌గా జరిగిన ఈ భేటీలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, సీతక్కలు పాల్గొన్నారు.

Tags:    

Similar News