కరోనా వ్యాప్తికి కారణం.. ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం : భట్టి
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శాస్త్రీయ ఆలోచన లేకపోవడంతోనే కరోనా ఉధృతి ఎక్కువైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. సోమవారం ప్రముఖులతో వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా ప్రమాదకరంగా మారుతోందని రాహుల్ గాంధీ చెప్పినా.. కేంద్రం పెడచెవిన పెట్టిందని గుర్తుచేశారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని, దీనికితోడే నమస్తే ట్రంప్, కుంభమేళా వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించడంతో కరోనా విజృంభించిందని ఆరోపించారు. ప్రజలకు వైద్య […]
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శాస్త్రీయ ఆలోచన లేకపోవడంతోనే కరోనా ఉధృతి ఎక్కువైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. సోమవారం ప్రముఖులతో వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా ప్రమాదకరంగా మారుతోందని రాహుల్ గాంధీ చెప్పినా.. కేంద్రం పెడచెవిన పెట్టిందని గుర్తుచేశారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని, దీనికితోడే నమస్తే ట్రంప్, కుంభమేళా వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించడంతో కరోనా విజృంభించిందని ఆరోపించారు.
ప్రజలకు వైద్య సదుపాయాలతో పాటు ఆక్సిజన్, వెంటిలేటర్లు వంటి వాటిని సమకూర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మాజీ ఐఏఎస్ సుజాతారావు మాట్లాడుతూ.. కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం కావడంతోనే మరణాలు సంభవిస్తున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్‌లను మన అవసరాలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో నిల్వ చేసుకుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అయ్యాయన్నారు. వైరస్‌లకు ఉచితంగా దేశవ్యాప్తంగా టీకాల విధానాన్ని నాటి ప్రభుత్వాలు అమలు చేశాయని అదే విధానాన్ని కొనసాగించాలని కోరారు.