కేసీఆర్ బయటకొచ్చి సమాధానం చెప్పాలి: భట్టి

దిశ‌, మ‌ధిర: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. కరోనా కట్టడిలో కేసీఆర్ విఫలం అయ్యారని, ఇప్పుడు ప్రజల దృష్టిని మళ్లించేందుకే కొత్త సచివాలయ నిర్మాణం పేరిట పాత సెక్రటేరియట్‌ను కూల్చివేస్తున్నారన్నారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ ధ్వంసం చేస్తే ప్రజలు క్షమించరని ఖమ్మం జిల్లా మధిరలోని ఆయన క్యాంప్ ఆఫీస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఎన్నోఏళ్లుగా రాష్ట్రంలో పాలన అందించిన సచివాలయాన్ని ఆగమేఘాల మీద కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని అన్నారు. […]

Update: 2020-07-07 07:42 GMT

దిశ‌, మ‌ధిర: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. కరోనా కట్టడిలో కేసీఆర్ విఫలం అయ్యారని, ఇప్పుడు ప్రజల దృష్టిని మళ్లించేందుకే కొత్త సచివాలయ నిర్మాణం పేరిట పాత సెక్రటేరియట్‌ను కూల్చివేస్తున్నారన్నారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ ధ్వంసం చేస్తే ప్రజలు క్షమించరని ఖమ్మం జిల్లా మధిరలోని ఆయన క్యాంప్ ఆఫీస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఎన్నోఏళ్లుగా రాష్ట్రంలో పాలన అందించిన సచివాలయాన్ని ఆగమేఘాల మీద కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని అన్నారు. అన్ని రోడ్లను మూసేసి ప్రజల రాకపోకలను నియంత్రించి సీక్రెట్గా కూల్చ‌డం ఏంటని ప్రశ్నించారు.

బతికుంటే బలుసాకు తినొచ్చు అని చెప్పిన మీరు ఆ రకంగా బతికించడానికి మన దగ్గరున్న వనరులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఓ పక్క ఊపిరాడక ప్రజలు చనిపోతున్నారు, మరోవైపు పేషెంట్లనీ చూడడానికి వైద్యులు లేక, పారా మెడికల్ సిబ్బంది లేక, డాక్టర్లకు నాణ్యమైన పీపీఈ కిట్లు ఇవ్వకుండా, హాస్పిటళ్లలో బెడ్లు ఖాళీ లేక ఎప్పుడు ఏమవుతుందో తెలియక ప్రజలందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నార‌ని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News