'కరోనాకు ముందులా గృహ రుణాల డిమాండ్'!

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా కరోనాకు ముందునాటి స్థాయికి మెరుగు పడుతుండటంతో పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ బిల్డర్లకు అవసరమైన సూచనలను ఇస్తోంది. గృహ రుణాల డిమాండ్ దాదాపు సాధారణ స్థితికి చేరుకుంటున్నందున అమ్మకాలను మెరుగుపరిచే చర్యలను ప్రారంభించాలని సూచించినట్టు పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ, సీఈవో హర్దయాల్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక కార్యకలాపాలు తక్కువగానే ఉన్నాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో స్పష్టంగా కరోనాకు ముందునాటి స్థాయిలోకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో బిల్డర్లు, అమ్మకందారులు వినియోగదారులతో […]

Update: 2020-11-08 10:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా కరోనాకు ముందునాటి స్థాయికి మెరుగు పడుతుండటంతో పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ బిల్డర్లకు అవసరమైన సూచనలను ఇస్తోంది. గృహ రుణాల డిమాండ్ దాదాపు సాధారణ స్థితికి చేరుకుంటున్నందున అమ్మకాలను మెరుగుపరిచే చర్యలను ప్రారంభించాలని సూచించినట్టు పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ, సీఈవో హర్దయాల్ ప్రసాద్ తెలిపారు.

ప్రస్తుతం ఆర్థిక కార్యకలాపాలు తక్కువగానే ఉన్నాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో స్పష్టంగా కరోనాకు ముందునాటి స్థాయిలోకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో బిల్డర్లు, అమ్మకందారులు వినియోగదారులతో మాట్లాడినప్పుడు రుణాలకు సంబంధించి సానుకూల స్పందనలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు సేకరించిన వివరాల ప్రకారం.. ఇప్పటికే కరోనాకు ముందున్న స్థాయిలో 80-85 శాతం రికవరీ సాధించామని, చాలామంది బిల్డర్లు పలుచోట్ల వినియోగదారులకు ఉచిత పార్కింగ్, జీరో స్టాంప్ డ్యూటీ, ఇతర ప్రోత్సాహకాలను అందిస్తున్నారని తెలిసింది.

ఈ రకమైన ఆకర్షణీయమైన ఆఫర్లతో వినియోగదారుల నుంచి మెరుగైన డిమాండ్ అందుతోందని ప్రసాద్ పేర్కొన్నారు. కార్పొరేట్ ఫైనాన్స్ ఉన్న కారణంగా అమ్మకాలను మెరుగుపరచాలని బిల్డర్లను కోరుతున్నామని, తద్వారా రుణాల చెల్లింపులు జరుగుతాయని వెల్లడించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పండుగ సీజన్ మరింత మెరుగ్గా ఉండనున్నట్టు ఆశిస్తున్నామని ప్రసాద్ తెలిపారు.

Tags:    

Similar News