అది నా భూమి.. వాటర్ ట్యాంక్ ఎక్కిన వృద్దుడు
దిశ, సిరిసిల్ల: తన పేరు మీద పట్టా అయిన భూమిని సమీప బంధువులు ఆక్రమించుకున్నారంటూ ఓ వృద్దుడు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన జంగం శివరాజ్ అనే వృద్ధుడు తనకు చెందిన 36 గంటల భూమిని సమీపం బంధువులైన జంగం శంకర్, జంగం రవి అనే అన్నదమ్ములు ఇద్దరు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ పెద్ద చెరువు కట్ట వద్ద గల వాటర్ ట్యాంక్ ఎక్కాడు. అది తన భూమి […]
దిశ, సిరిసిల్ల: తన పేరు మీద పట్టా అయిన భూమిని సమీప బంధువులు ఆక్రమించుకున్నారంటూ ఓ వృద్దుడు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన జంగం శివరాజ్ అనే వృద్ధుడు తనకు చెందిన 36 గంటల భూమిని సమీపం బంధువులైన జంగం శంకర్, జంగం రవి అనే అన్నదమ్ములు ఇద్దరు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ పెద్ద చెరువు కట్ట వద్ద గల వాటర్ ట్యాంక్ ఎక్కాడు. అది తన భూమి అని, 12ఏండ్ల క్రితం తన భూమిని అన్నదమ్ములిద్దరికీ కౌలుకు ఇచ్చి, సరైన ఉపాధి లేకపోవడంతో, వలస వెళ్లి జీవించానని చెప్పాడు. తన భూమిని తనకు అప్పగించాలని అడగ్గా పంచాయతీ పెట్టారన్నారు. ఇటీవల తనకు పాసు బుక్కు వచ్చినా తన భూమి తనకు ఇవ్వడం లేదని శివరాజ్ ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతన్ని సముదాయించి కిందకు దింపారు. న్యాయం జరిగేలా చూస్తానని ఎస్సై లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు.