భూమిపైనున్న జీవులన్నీ ఆ చెట్టుపైనే!

దిశ, ఫీచర్స్: ఇంగ్లాండ్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజ్, ఆక్స్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ‘వన్ జూమ్’ (One Zoom) అనే ‘ఇంటరాక్టివ్ ట్రీ ఆఫ్ లైఫ్‌’ను రూపొందించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘గూగుల్ ఎర్త్ ఆఫ్ బయాలజీ’‌గా అభివర్ణించొచ్చు. దాదాపు 2.2 మిలియన్ జీవ జాతులను ఈ ట్రీ కలుపుతుందని బృందం చెబుతోంది. మీరు ఏదైనా జాతిని జూమ్ ఇన్ చేయవచ్చు, ఇతర జీవ జాతులతో దాని సంబంధ విశేషాలతో పాటు దాని IUCN స్థితిని అన్వేషించవచ్చు. విజువలైజేషన్, డేటా […]

Update: 2021-12-21 08:23 GMT

దిశ, ఫీచర్స్: ఇంగ్లాండ్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజ్, ఆక్స్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ‘వన్ జూమ్’ (One Zoom) అనే ‘ఇంటరాక్టివ్ ట్రీ ఆఫ్ లైఫ్‌’ను రూపొందించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘గూగుల్ ఎర్త్ ఆఫ్ బయాలజీ’‌గా అభివర్ణించొచ్చు. దాదాపు 2.2 మిలియన్ జీవ జాతులను ఈ ట్రీ కలుపుతుందని బృందం చెబుతోంది. మీరు ఏదైనా జాతిని జూమ్ ఇన్ చేయవచ్చు, ఇతర జీవ జాతులతో దాని సంబంధ విశేషాలతో పాటు దాని IUCN స్థితిని అన్వేషించవచ్చు.

విజువలైజేషన్, డేటా ప్రాసెసింగ్ కోసం కొత్త అల్గారిథమ్స్ అభివృద్ధి చేయడం ద్వారా… వాటిని బహుళ మూలాల నుంచి సేకరించిన ‘బిగ్ డేటా తో కలపడం ద్వారా ‘వన్ జూమ్’‌ను రూపొందించారు. ఇది ఆయా వ్యక్తుల ఇష్టమైన జీవుల విశేషాలను, మూలాలను కనుగొనేందుకు అనుమతిస్తుంది. భూమిపై ఉన్న అన్ని జీవుల తో కూడిన ఈ పెద్ద వృక్షం, పరిణామ చరిత్ర వాటిని ఎలా కలుపుతుందో ఇందులో చూడొచ్చు. చెట్లపై ఉన్న ఆకులకు కొన్ని కలర్ కోడ్స్‌ ఇచ్చారు. ఆ ఆకుపై ఉన్న జీవులు అంతరించి పోయే ప్రమాదాన్ని బట్టి కలర్ కోడ్ ఉంటుంది. ఆకుపచ్చగా ఉంటే ఆ జాతికి ముప్పు లేకపోగా.. ఎరుపు రంగులో ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే. అదే బ్లాక్ కలర్ ఇటీవల అంతరించిపోయిన జీవులకు సంకేతంగా నిలుస్తుంది.

‘ప్రతీ ఒక్క జీవిని అన్వేషించేందుకు, ఆ ప్రక్రియను సులభతరం చేసేందుకు చాలా కష్టపడి ఈ ట్రీని తయారు చేశాం. అంతేకాదు మన జీవవైవిద్యం చాలా వరకు ముప్పులో ఉందనే శక్తివంతమైన సందేశాన్ని కూడా అందిస్తున్నాం. చెట్టుపై ఉన్న చాలా ఆకులు బూడిద రంగులో ఉంటాయి. అవి పూర్తిగా అధ్యయనం చేయబడలేదు లేదా డేటా లోపభూయిష్టంగా ఉందని అర్థం. వాటి అంతరించిపోయే ప్రమాదం గురించి మనకు తెలియదు, అంటే వాటిపై ఇంకా పరిశోధన జరగాల్సిన అవసరముందనే సందేశాన్ని అందిస్తుంది. రెండు మిలియన్ జాతులు దృశ్యమానం చేశాం. ఏ మ్యూజియం లేదా జూ వాటన్నింటిని కలిగి ఉండదు కానీ మా సాధనం భూమిపైనున్న అన్ని జాతులను సూచించడంలో సాయపడుతుంది. సందర్శకులను ఆయా జంతువులతో కనెక్ట్ చేసేందుకు అనుమతిస్తుంది.

– డాక్టర్ రోసిండెల్

https://www.onezoom.org/

Tags:    

Similar News