ప్రతినిధులు, స్థానికుల మధ్య వాగ్వాదం.. కారణం..?
దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఐటీసీ ఈస్ట్ గేట్ వద్ద ఐటిసీ నుంచి వస్తున్న వ్యర్ధ జలాల పైపులైను గత మూడు నెలలుగా లీక్ అవుతోంది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవడంతోపాటు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో మంగళవారం ఐటీసీ యాజమాన్యం గేటు వద్ద నిరసనకు దిగారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. వ్యర్థ జలాలు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే సంస్థ […]
దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఐటీసీ ఈస్ట్ గేట్ వద్ద ఐటిసీ నుంచి వస్తున్న వ్యర్ధ జలాల పైపులైను గత మూడు నెలలుగా లీక్ అవుతోంది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవడంతోపాటు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో మంగళవారం ఐటీసీ యాజమాన్యం గేటు వద్ద నిరసనకు దిగారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. వ్యర్థ జలాలు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే సంస్థ ప్రతినిధులకు, స్థానికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.