సువర్ణ అవకాశం.. ఎస్సీ స్టడీ సర్కిల్‌‌లో సివిల్స్‌ కోచింగ్‌ ఫ్రీ

దిశ, మహబూబ్‌నగర్: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్సీ స్టడీ సర్కిల్‌ ఉచితంగా సివిల్స్‌ కోచింగ్‌ అందిస్తున్నది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ డీడీ పెరిక యాదయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ అప్లికేషన్లు వచ్చే నెల 10 వరకు అందుబాటులో ఉంటాయని ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎంపికైన అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (సీసాట్‌)కు ఉచితంగా కోచింగ్‌ అందించనున్నారు. అర్హతలు: అభ్యర్థులు డిగ్రీ […]

Update: 2021-09-22 07:33 GMT

దిశ, మహబూబ్‌నగర్: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్సీ స్టడీ సర్కిల్‌ ఉచితంగా సివిల్స్‌ కోచింగ్‌ అందిస్తున్నది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ డీడీ పెరిక యాదయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ అప్లికేషన్లు వచ్చే నెల 10 వరకు అందుబాటులో ఉంటాయని ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎంపికైన అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (సీసాట్‌)కు ఉచితంగా కోచింగ్‌ అందించనున్నారు.

అర్హతలు: అభ్యర్థులు డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించకూడదు. ఎలాంటి ఉద్యోగం, మరే ఇతర కోర్సులు చదువుతూ ఉండకూడదని క్లారిటీ ఇచ్చారు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్‌ 10
వెబ్‌సైట్‌: http://www.tsstudycircle.co.in

Tags:    

Similar News