కేంద్రం కీలక నిర్ణయం.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సినీ ప్రముఖులు

దిశ, వెబ్‌డెస్క్ : భారతీయ సినీపరిశ్రమపై కేంద్రప్రభుత్వం దృష్టి సారించింది. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా సినిమాలు ఉంటున్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు వెళ్లువెత్తడంతో సినిమాటోగ్రఫీ చట్ట సవరణకు కేంద్రం సిద్ధమైంది. 1952 నాటి సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరిస్తూ ముసాయిదా బిల్లును రూపొందించింది. ప్రధానంగా సినిమా సెన్సార్‌పై దృష్టిసారించిన కేంద్రం ప్రసార మంత్రిత్వశాఖ 2013లో జస్టిస్ ముఖాల్ ముఖ్ధాల్, 2016లో శ్యామ్ దన్‌గల్ కమిటీ ఇచ్చిన నివేధికల ఆధారంగా పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో సవరణల […]

Update: 2021-07-02 23:37 GMT

దిశ, వెబ్‌డెస్క్ : భారతీయ సినీపరిశ్రమపై కేంద్రప్రభుత్వం దృష్టి సారించింది. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా సినిమాలు ఉంటున్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు వెళ్లువెత్తడంతో సినిమాటోగ్రఫీ చట్ట సవరణకు కేంద్రం సిద్ధమైంది. 1952 నాటి సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరిస్తూ ముసాయిదా బిల్లును రూపొందించింది. ప్రధానంగా సినిమా సెన్సార్‌పై దృష్టిసారించిన కేంద్రం ప్రసార మంత్రిత్వశాఖ 2013లో జస్టిస్ ముఖాల్ ముఖ్ధాల్, 2016లో శ్యామ్ దన్‌గల్ కమిటీ ఇచ్చిన నివేధికల ఆధారంగా పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో సవరణల ప్రతిపాదనలపై జూలై2 వరకు అభిప్రాయాలను తెలపాలని కోరుతూ జూన్ 18న ప్రకటనలు జారీ చేసింది. చట్టంలో సవరించాలని భావిస్తున్న ప్రతిపాదనలు అందులో వివరించింది. సెన్సార్ బోర్డు జారీ చేసిన ధృవ పత్రాలను పున:పరిశీలించాలని ఆ సంస్థ ఛైర్మన్‌ను ఆదేశించే అధికారం కేంద్రప్రభుత్వానికి ఉండేలా చట్టాలను ప్రతిపాదిస్తామని పేర్కొంది. అంతేకాకుండా సినిమా ప్రదర్శనలకు జారీ చేసే U,A U/A, S సర్టిఫికేట్‌లతో పాటు U,A సర్టిఫికేట్‌కు అదనంగా మరిన్ని మార్పులను ప్రతిపాదించింది. U,A సర్టిఫికేట్‌ 1883లో చేసిన సవరణలకు అనుగుణంగా ఉంది.

అప్పటినుంచి ఎలాంటి మార్పులు చేయలేదు. తల్లిదండ్రుల అనుమతితో 12 ఏళ్ల పిల్లలు సినిమా చూసే అనుమతి ఆ సర్టిఫికేట్ ఇస్తుంది. అయితే దీనికి మార్పులు చేసి 7 ఏళ్లు, 13, 16 ఏళ్ల పై పడిన వారు కూడా చూసేలా మూడు విభాగాలుగా విభజించింది. మరోవైపు పైరసీ వలన సినిమా పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని, సినిమా పైరసీకి అడ్డుకట్ట వేయడానికి ఇప్పటివరకు సరైన చట్టం లేదని గుర్తించింది కేంద్రప్రభుత్వం. సినిమా పైరసీకి పాల్పడితే కనిష్ఠంగా మూడు నెలలు గరిష్ఠంగా మూడుఏండ్ల జైలు శిక్ష, మూడు లక్షల జరిమానా విధించనున్నారు. అంతే కాకుండా సినిమా నిర్మాణ వ్యయంలో 5శాతం డబ్బులు జరిమానా రూపంలో చెల్లించాల్సి ఉంటుందని ప్రతిపాదించింది.

సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో సినీ ప్రముఖల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమాటోగ్రఫీ చట్టసవరణ ప్రతిపాదనపై కమలహాసన్ మండిపడ్డారు. సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్‌ను కూడా పక్కన పెట్టి రివ్యూ చేసే ఈ ప్రతిపాదన తమకు సమ్మతం కాదని తేల్చి చెప్పారు. ఇష్టా రాజ్యంగా చట్టాలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఈ ప్రపోజల్‌పై సినిమా రంగం స్పందించాలని, స్వేచ్ఛా కోసం గళమెత్తాలన్నారు. ఈ డ్రాఫ్ట్స్ బిల్లుపై కేంద్రం కామెట్స్ కోరగా దీనికి చిత్ర నిర్మాతలు తమ రెస్పాన్స్ ఇచ్చారు. ఈ చట్టానికి సవరణలు చేస్తే సెన్సార్ బోర్డు ఇదివరకే క్లియర్ చేసిన సినిమాలను తిరిగి సమీక్షించడానికి కేంద్రానికి అధికారాలు లభిస్తాయి. పైగా అప్లైడ్ బోర్డుకు కూడా ఎలాంటి పవర్స్ ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తన భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేదేనని దర్శక నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News