Vishwak Sen: సామాన్యులకు బంపర్ ఆఫర్.. విశ్వక్ సేన్ మూవీలో నటించే అవకాశం!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishvak Sen) హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా ప్రజెంట్ వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు.

Update: 2024-12-17 13:30 GMT

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishvak Sen) హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా ప్రజెంట్ వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘ఫంకీ’ ఒకటి. ‘జాతి రత్నాలు’ (jathi rathnalu) ఫేమ్ డైరెక్టర్ కెవి అనుదీప్‌ (KV Anudeep) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ఫార్చ్యూన్ ఎంటర్‌టైన్‌మెంట్స్(Fortune Entertainments), సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌(Sitara Entertainments)పై ప్రముఖ ప్రొడ్యూసర్స్ సాయి సౌజన్య (Sai Saujanya), నాగవంశీ(Nagavanshi) రూపొందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది స్టార్ట్ కానుండగా.. తాజాగా బంపర్ ఆఫర్ (Bumper Offer) ప్రకటించారు చిత్ర బృందం.

ఈ సినిమాలో నటించేందుకు సామన్యులకు అవకాశం కల్పించారు. ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ.. ‘FUNKY’ కోసం కాస్టింగ్ కాల్.. వయస్సు లేదా లింగ పరిమితులు లేవు! నటనపై ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తుల కోసం మేము వెతుకుతున్నాము. మీకు ప్రతిభ ఉంటే, మేము దానిని చూడాలనుకుంటున్నాము! మీ పోర్ట్‌ఫోలియోను పంపండి anudeepteam@gmail.com కి పంపండి’ అంటూ పోస్ట్ పెట్టారు. ప్రజెంట్ ఇది వైరల్‌గా మారింది.

Tags:    

Similar News