Honey Rose : అతను నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు : హనీరోజ్ సంచలన వ్యాఖ్యలు

మలయాళ ముద్దుగుమ్మ హనీరోజ్(Honey Rose) సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సంచలనం రేపుతోంది.

Update: 2025-01-05 14:42 GMT

దిశ, వెబ్ డెస్క్ : మలయాళ ముద్దుగుమ్మ హనీరోజ్(Honey Rose) సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సంచలనం రేపుతోంది. తనను ఓ వ్యక్తి సెక్సువల్ హెరాస్మెంట్(Sexual Harassment) చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ హనీ ఆ పోస్ట్ పెట్టింది. గతంలో ఓ వ్యాపారవేత్త నిర్వహించిన ఈవెంట్ కు తాను హాజరయ్యానని.. అప్పటి నుంచి అతను తన వెంట పడుతున్నాడని పేర్కొంది. సోషల్ మీడియాలో తన పరువుకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నాడని, తాను ఎక్కడికి వెళితే అక్కడ ఆ వ్యక్తి ప్రత్యక్షం అవుతున్నాడని తెలిపింది. అతడిపై చట్టపరంగా పోరాడతానని చెప్పుకొచ్చింది ఈ మలయాళ ముద్దుగుమ్మ. కాగా హనీ రోజ్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా, ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.  

Tags:    

Similar News