Unni Mukundan: బాక్సాఫీసును షేక్ చేస్తున్న ‘మార్కో’ మూవీ.. ఇప్పటి వరకు ఎన్ని కోట్లు రాబట్టిందంటే?
టాలెంటెడ్ యాక్టర్ ఉన్ని ముకుందన్(Unni Mukundan) ఇటీవల ‘మార్కో’(Marco) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
దిశ, సినిమా: టాలెంటెడ్ యాక్టర్ ఉన్ని ముకుందన్(Unni Mukundan) ఇటీవల ‘మార్కో’(Marco) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హనీఫ్ అదేని(Hanif Adeni) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఇషాన్ శౌలత్(Ishan Shaulat), అభిమన్యు ఎస్ థిలకన్, యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్(Kabir Duhan Singh), సిద్దిఖీ కీలక పాత్రల్లో నటించారు.
అయితే ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదలై పాజిటిక్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతుంది. తాజాగా, ‘మార్కో’ మూవీ 100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ ఉన్ని ముకుందన్ వైల్డ్ పోస్టర్(Wild Poster)ను షేర్ చేశారు.
100* #Marco pic.twitter.com/IGojPpHTqS
— BA Raju's Team (@baraju_SuperHit) January 5, 2025