Divi Vadthya: " వడ్డించా నేను చాలా నీకు" అంటూ క్యాప్షన్ పెట్టి హాట్ ఫోటోస్ షేర్ చేసిన బిగ్ బాస్ దివి
బిగ్ బాస్ కు వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి దివి లైఫ్ మొత్తం మారిపోయింది.
దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ కు వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి దివి ( Bigg Boss Divi ) లైఫ్ మొత్తం మారిపోయింది. ఇంతక ముందు మహేష్ బాబు మూవీలో కనిపించినప్పటికీ సరైన గుర్తింపు రాలేదు. ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప 2 మూవీలో జర్నలిస్ట్ గా నటించిన అందర్నీ మెప్పించింది. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే దివి.. నెట్టింట లేటెస్ట్ ఫ్యాషన్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రాళ్లను పడేస్తుంది. తాజాగా, ఈ అమ్మడు వైట్ డ్రెస్ లో గ్లామర్ డోస్ పెంచుతూ కెమెరాకు హాట్ ఫోజులిచ్చింది. అందంగా ముస్తాబైన దివి ఫోటోలపై నెటిజన్లు రియాక్ట్ అయి చాలా చాలా ముద్దుగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాలికి కడియాలు, వంకీలు పెట్టుకొని వింటేజ్ లుక్ లో మెరిసింది. దివి, ఓ వైపు మూవీస్ చేస్తూనే.. ఇంకో వైపు నెట్టింట హాట్ ఫోటో షూట్స్ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది బ్యూటీ. మోడల్ గా తన కెరీర్ మొదలు పెట్టిన దివి.. మహర్షి మూవీతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఇదే ఫేమ్ తో బిగ్ బాస్ సీజన్ 4లో అడుగుపెట్టి క్రేజ్ తెచ్చుకుంది. ఇటీవలే విడుదలైన లంబసింగి, హరికథ వంటి సినిమాల్లో మెరిసింది.