Daaku Maharaj: 'డాకు మహారాజ్' ఆ భాషల్లో కూడా విడుదల కానుందా ?

నందమూరి బాలకృష్ణ ( Balakrishna ) హీరోగా నటిస్తున్న సినిమా " డాకు మహారాజ్ " ( Daaku Maharaaj)

Update: 2025-01-08 07:22 GMT

దిశ, వెబ్ డెస్క్ : నందమూరి బాలకృష్ణ ( Balakrishna ) హీరోగా నటిస్తున్న సినిమా " డాకు మహారాజ్ " ( Daaku Maharaaj) . యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మన ముందుకు రాబోతున్న ఈ మూవీకి డైరెక్టర్ బాబీ ( Bobby) దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా " డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ " బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. ఇక రెండో పాట ‘చిన్ని’ ఎమోషనల్ టచ్‌తో ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది.

ఇక మూవీకి మ్యూజిక్ నందించిన తమన్ తన బీజీఎమ్ తో థియేటర్స్ లో మోత మోగడం పక్కా అని ఇటీవల నిర్మాత నాగ వంశీ కూడా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా, ఈ మూవీని తెలుగుతో పాటూ హిందీ, తమిళంలో కూడా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ముందుగా తెలుగులో మాత్రమే రిలీజ్ చేయాలనుకున్నప్పటికే కథపై ఉన్న నమ్మకంతో హిందీ, తమిళ భాషల్లోనూ అదే రోజున అంటే జనవరి 12న రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని సినీ వర్గాల నుంచి సమాచారం.

Tags:    

Similar News