ఓటీటీలోకి ఉపేంద్ర ‘యూఐ’ సినిమా.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్ (పోస్ట్)

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘యూఐ’.

Update: 2025-01-09 03:11 GMT

దిశ, సినిమా: కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘యూఐ’. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్, వీనస్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్స్ పై కె పి శ్రీకాంత్ నిర్మాతగా నవీన్ మనోహరన్ సహా నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ చిత్రంలో రీష్మా నానయ్య, నిధి సుబ్బయ్య, పి రవిశంకర్ కీలక పాత్రలో నటించారు. అయితే డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. కర్ణాటక లోనే కాకుండా విదేశీ భాషల్లోనూ యూఐ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టిందని మేకర్స్ అంటున్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

గత కొన్ని రోజులుగా ఓటీటీలో ‘యూఐ’ విడుదల కాబోతోందని, తమిళం, తెలుగు భాషల్లో పాపులర్ అయిన సన్ నెక్స్ట్ ఓటీటీలో జనవరి రెండో వారంలో స్ట్రీమింగ్‌కి రానుందని కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఉపేంద్ర సుదీప్ నటించిన ‘ముకుంద-మురారి’ చిత్రం సన్ నెక్స్ట్ ఓటీటీలో ప్రసారం అవుతోంది. కాబట్టి సన్ నెక్స్ట్‌లోనే యూఐ మూవీ కూడా రిలీజ్ అవుతుందని వార్తలు వినిపించాయి. ఈ విషయంపై తాజాగా మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

యూఐ చిత్ర నిర్మాతల్లో ఒకరైన కేపీ శ్రీకాంత్ క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌‌ను పంచుకున్నారు. ‘UI చిత్రం ఓటీటీ హక్కులను సన్ నెక్స్ట్ కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇది ఫేక్ న్యూస్. సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేయడం లేదా విడుదల చేయడంపై చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసే వరకు, ఇలాంటి ఫేక్ వార్తలను ఎవరూ నమ్మొద్దు. అధికారిక ప్రకటనను చిత్ర బృందం స్వయంగా ప్రకటిస్తుంది’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Full View

Tags:    

Similar News