Venu Swamy: ‘పుష్ప-2’ మూవీ చూసిన వేణు స్వామి.. అల్లు అర్జున్ జాతకం ఇదేనంటూ పోస్ట్ (వీడియో)
అల్లు అర్జున్(Allu Arjun) అభిమానులతో పాటు, ప్రేక్షకుల ఎంతగానో వెయిట్ చేసిన సమయం రానే వచ్చింది.
దిశ, సినిమా: అల్లు అర్జున్(Allu Arjun) అభిమానులతో పాటు, ప్రేక్షకుల ఎంతగానో వెయిట్ చేసిన సమయం రానే వచ్చింది. ఎట్టకేలకు ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అంతేకాకుండా మొదటి రోజే ఏకంగా రూ. 294 కోట్ల కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. తొలిరోజే బిగ్గెస్ట్ ఓపెనింగ్ చేసిన సినిమాగా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఈ మూవీ చూసిన ప్రేక్షకులతో, పాటు సినీ సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు. తాజాగా, ‘పుష్ప-2’ చిత్రాన్ని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి(Venu Swamy) చూశారు.
ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో ఓ వీడియోను షేర్ చేశారు. ‘‘అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ మూవీ ఇప్పుడే చూసి వచ్చాను. రాజమాతంగి గెటప్‌లో బ్లూ కలర్ చీర కట్టుకుని ఆయన జాతర సీన్‌లో ఇరగదీశారు. అయితే 2016 నుండి కొన్ని చానల్స్‌లో నేను చెప్పిన జాతకాలకు సంబంధించిన వీడియోలు ఇక్కడ చూడండి. అల్లు అర్జున్(Allu Arjun)కు మరో పదేళ్లు తిరుగులేదు. ఆయనతో సినిమాలు చేస్తే ఎవరూ నష్టపోరు. ఇంకా 15 ఏళ్లు కూడా ఏ మూవీ చేసినా హిట్ అవ్వడం ఖాయం. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నిజమైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ఒక్కడే’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.