మిమ్మల్ని క్షమించినా తప్పే!.. పోసాని నిర్ణయంపై యంగ్ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్

ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి రాజకీయాలకు గుడ్ చెబుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Update: 2024-11-22 06:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) రాజకీయాలకు గుడ్ చెబుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రాజకీయాలు, సినిమాలు అంటూ ఫ్యామిలీకి, పిల్లలకు సమయం ఇవ్వలేకపోతున్నానని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చారు. తాజాగా.. పోసాని కృష్ణ మురళి నిర్ణయంపై యంగ్ ప్రొడ్యూసర్ SKN స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ పెట్టారు.

‘సార్, ఇప్పుడు అందరికీ అన్నీ గుర్తొస్తాయి. రాజకీయాల నుంచి విరమించుకున్నాను అని నటించే ముందు మా అభిమాన నాయకుడి.. గురించి ముఖ్యంగా వారి ఇంట్లోని పసి పిల్లల గురించి మాట్లాడిన నీచమైన, సంస్కారం లేని లేకి వాఖ్యలకి చింతిస్తున్నాను అనో లేదా క్షమించండి అని అడిగి ఉంటే మీ మాటలు నమ్మాలనిపించేది. ఏదో ఒకసారి పొరపాటుగా మాట్లాడిన వ్యక్తి కాదు మీరు. ఎన్నోసార్లు ఎంతో నీచంగా మాట్లాడారు. అభిమానుల మనసు చాలా అంటే చాలా బాధ పెట్టారు. ఛీ ఇవేం మాటలు అని చెవులు మూసుకునేలా చేశారు. మీ ఒకళ్ళదే కాదు సార్.. అందరివీ కుటుంబాలే. ఎవరి పిల్లలు అయినా పిల్లలే. రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ వ్యక్తిగతంగా దిగజారుడు పదాలు.. కుటుంబాల మీద కామెంట్స్ చేసిన వారు మాత్రం క్షమార్హులు కాదు’ అని ఎస్‌కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.




Tags:    

Similar News