Allu Arjun: అల్లు అర్జున్ కు బిగ్ షాక్ .. బెయిల్ రద్దవుతుందా.. పోలీసులు ఏం చేయబోతున్నారు?

అల్లు అర్జున్ చెప్పే మాటల్లో నిజం లేదని నెటిజన్స్ నుంచి సామాన్య ప్రజల వరకు విమర్శలు చేస్తున్నారు.

Update: 2024-12-23 02:38 GMT

దిశ, వెబ్ డెస్క్ : అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప 2 మూవీ రిలీజ్ టైంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించడం, ఓ బాబు కోమాలోకి వెళ్లడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుని శనివారం అసెంబ్లీలో కూడా దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై, సినీ ఇండస్ట్రీపై మండిపడ్డారు. అయితే, దీనిపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తన మీద వస్తున్న అభియోగాలకు క్లారిటీ ఇచ్చారు. కానీ, బన్నీ చెప్పే మాటల్లో నిజం లేదని నెటిజన్స్ నుంచి సామాన్య ప్రజల వరకు విమర్శలు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు అల్లు అర్జున్ కు తెలంగాణ పోలీసులు బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.

బెయిల్ రద్దు ఎందుకంటే?

హైకోర్టు బెయిల్ ఇస్తూ.. అతనికి కొన్ని కండీషన్లు పెట్టింది. కానీ, అల్లు అర్జున్ వాటిలో వేటిని పాటించకుండా .. ఇష్టమొచ్చినట్లు ప్రెస్ మీట్లు పెడుతున్నారని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక సినిమా హీరో అయి ఉండి, రూల్స్ పాటించాలని తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. శనివారం రాత్రి పెట్టిన ప్రెస్‌మీట్ పెద్ద దుమారం రేపుతోంది. ఇది బెయిల్ రూల్స్‌కి విరుద్ధమే అని పోలీసులు అంటున్నారు. చట్టానికి అందరూ ఒకటే .. ఎవరు చుట్టం కాదు అంటూ అల్లు అర్జున్ పై పోలీసులు ఫైర్ అవుతున్నారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని అతని బెయిల్ రద్దు కోసం నేడు హైకోర్టులో పిటిషన్ వెయ్యబోతున్నారని తెలిసిన సమాచారం. 

Tags:    

Similar News