గుడ్ న్యూస్ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్.. ట్విన్స్ పుట్టారంటూ శ్రద్ధా పోస్ట్
హీరోయిన్ శ్రద్ధా ఆర్య(Shraddha Arya) ‘కాల్వనిన్ కాదలి’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది.
దిశ, సినిమా: హీరోయిన్ శ్రద్ధా ఆర్య(Shraddha Arya) ‘కాల్వనిన్ కాదలి’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక తెలుగులో ‘గొడవ’(Godava) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో మైమరిపించింది. ఆ తర్వాత రోమియో(Romeo), కోతిమూక వంటి సినిమాల్లో నటించింది. అలాగే పలు సీరియల్స్‌లోనూ యాక్ట్ చేసింది. గత ఏడాది ‘రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’(Rocky Aur Rani Kii Prem Kahaani ) మూవీలో గెస్ట్ రోల్ చేసింది.
ఇక శ్రద్ధా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. 2021లో నేవీ ఆఫీసర్ రాహుల్ నగల్(Rahul Nagal)ను పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించింది. ఇదిలా ఉంటే.. తాజాగా, శ్రద్ధా ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా గుడ్ న్యూస్ ప్రకటించింది. నవంబర్ 29న తనకు ట్విన్స్ (ఓ అమ్మాయి, అబ్బాయి) పుట్టినట్లు తెలుపుతూ వీడియోను షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కంగ్రాట్స్(Congratulations) చెబుతున్నారు.