రామ్ పోతినేని ‘రాపో-22’ సినిమాకు టైటిల్ ఫిక్స్.. వావ్, సూపర్ అదిరిపోయిందంటున్న నెటిజన్లు

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) గత బ్యాక్ టు బ్యాక్ సినిమాలో తన పాపులారిటీ పెంచుకుంటున్నారు.

Update: 2025-03-09 03:21 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) గత బ్యాక్ టు బ్యాక్ సినిమాలో తన పాపులారిటీ పెంచుకుంటున్నారు. గత ఏడాది ‘డబుల్ ఇస్మార్ట్’ (Double iSmart)మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ‘రాపో-22’. దీనిని ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు(Mahesh Babu) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ యెర్నేని(Naveen Yerneni), రవిశంకర్(Ravi Shankar) యలమంచిలి నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైపోయింది. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన పోస్టర్స్ కూడా విడుదలై మంచి రెస్సాన్స్‌ను దక్కించుకుంది.

అయితే షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాకు రామ్ పోతినేని స్వయంగా ఓ పాటను కూడా రాబోతున్నట్లు టాక్. ‘రాపో-22’ మూవీకి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ ద్వయం వివేక్, మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘రాపో-22’ చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీనికి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు టాక్. ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ కోసం ‘‘పిఠాపురం తాలూకా’’ అనే ట్రెండ్‌తో ఆయన అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఆయన డిప్యూటీ సీఎం కాకముందు అలా చేశారు. ఇక ఇప్పుడు అదే విధంగా ఉండేలా రామ్ పోతినేని సినిమా టైటిల్‌ను పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు వావ్, సూపర్ అదిరింది అని కామెంట్లు చేస్తున్నారు.

READ MORE ...

థియేటర్లలో రీ రిలీజ్ కాబోతున్న కార్తీ క్లాసికల్ మూవీ.. ట్రైలర్ చూశారా


Tags:    

Similar News