Sankrathi Lesson: ఈ సంక్రాంతి తెలుగు సినిమాలకు పెద్ద గుణపాఠమే నేర్పింది.. మేలుకోకపోతే డేంజర్లో పడ్డట్టే!

ఇంత వరకు ఈ విషయాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు.

Update: 2025-01-14 04:28 GMT
Sankrathi Lesson: ఈ సంక్రాంతి తెలుగు సినిమాలకు పెద్ద గుణపాఠమే నేర్పింది.. మేలుకోకపోతే డేంజర్లో పడ్డట్టే!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : ప్రతీ సంక్రాంతికి కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ ఏడాది కూడా స్టార్ హీరో సినిమాలు మన ముందుకొచ్చాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన " గేమ్ ఛేంజర్ "  ( Game Changer )  మూవీ జనవరి 10 న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో దూసుకెళ్తుంది. కానీ, విడుదలైన రెండో రోజున పైరసీ ( piracy  ) రూపంలో సినిమా బయటకు వచ్చింది.

ఇదిలా ఉండగా బాలకృష్ట హీరోగా " డాకు మహారాజ్ " ( Daaku Maharaaj  ) మూవీ జనవరి 12 న రిలీజ్ అయింది. ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకెళ్తూ రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ వసూలు చేస్తుంది. ఈ సినిమాని కూడా పైరసీ వెంటాడింది. నేడు వెంకటేశ్ హీరోగా " సంక్రాంతికి వస్తున్నాం" (  sankranthiki vastunnam ) సినిమా ప్రేక్షకులు ముందుకొచ్చింది.

అయితే, సినిమా రిలీజ్ అయిన 24 గంటల్లో HD ప్రింట్ బయటకు వస్తుండటంతో నిర్మాతలు తలలు పట్టుకునే పరిస్థితి వస్తుంది. కానీ, ఇంత వరకు ఈ విషయాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ఇలాగే, కొనసాగితే చాలా సమస్యలు వస్తాయని సినీ వర్గాల అంటున్నారు. నిర్మాతలు కోట్లు పెట్టినా కలెక్షన్స్ రావడం లేదంటే ఇదే ముఖ్య కారణం. ఇప్పుడైనా, తెలుగు సినిమాల వారు మేలుకోకపోతే పరిస్థితి దారుణంగా మారే అవకాశం ఉంది. ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటే మంచిదని ప్రేక్షకులు కూడా అభిప్రాయపడుతున్నారు. 

Tags:    

Similar News