Thaman: ఆ నాలుగు సినిమాలకు ఆన్సర్ ఇస్తున్నా.. ‘OG’ తో నేనేంటో చూపిస్తాను.. తమన్ సవాల్ ఎవరికంటే? (వీడియో)
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman)స్టార్ హీరోల చిత్రాలకు సంగీతం అందిస్తూ వరుస అవకాశాలు పొందుతున్నారు.
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman)స్టార్ హీరోల చిత్రాలకు సంగీతం అందిస్తూ వరుస అవకాశాలు పొందుతున్నారు. ఇటీవల డాకు మహారాజ్(Daaku Maharaaj), గేమ్ చేంజర్(Game Changer), సినిమాలతో భారీ హిట్ సాధించారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ ఓజీ మూవీతో తమిళ ఇండస్ట్రీకి నేనేంటో చూపిస్తానని సవాల్ చేశారు. ‘‘ఇప్పుడు నేను మీసం తిప్పి చెప్పుకుంటా.. ఈ మూడు సినిమాలకు మనం ఆన్సర్ ఇస్తున్నాం.. అదే ‘ఓజీ’.
అది వచ్చినప్పుడు మనం ఎవరో తమిళ వాళ్లకు తెలుస్తుంది. మనం ఎవరో చూపిస్తాం. ఆ గ్యాంగ్‌స్టర్ ఫిలింకి మనం చేస్తే ఎలా ఉంటుందో.. మన ఆన్సర్ ఏంటో చూస్తారు. ఒక జైలర్, లియో, బీస్ట్, విక్రమ్.. ఈ నాలుగు సినిమాలకి కలిపి ఒక ఓజీ ఆన్సర్ ఇస్తుంది. మాకు తెలుసు మన వాళ్లు కూడా గ్యాంగ్‌స్టర్ సినిమాలు చేస్తే ఈ సౌండ్ మారుతుంది. కంటెంట్ మారుతుంది. కొత్తగా వస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. అయితే తమన్ ఈ కామెంట్స్ అనిరుధ్‌ను ఉద్దేశించి చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, అనిరుధ్ తమిళ ఇండస్ట్రీలో పలు చిత్రాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చి ఎంతలా పాపులారిటీ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిళ స్టార్స్ రజినీకాంత్(Rajinikanth), మోహన్ లాల్(Mohanlal), శివన్న, విజయ్(Vijay) వంటి హీరోల నడిచొస్తుంటే అనిరుథ్ ఇచ్చిన బీజీఎంకి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. ప్రస్తుతం కోలీవుడ్ హీరోలంతా అనిరుధ్‌కు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.