Manchu Manoj: భార్యాపిల్లలతో కలిసి మెగా హీరోలతో సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకున్న మంచు హీరో.. కారణమేంటి?

నిన్న (జనవరి 14) తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

Update: 2025-01-15 03:03 GMT
Manchu Manoj: భార్యాపిల్లలతో కలిసి మెగా హీరోలతో సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకున్న మంచు హీరో.. కారణమేంటి?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: నిన్న (జనవరి 14) తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సినీ సెలబ్రిటీలు కూడా తమ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి చాలా హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తూ అదిరిపోయే ఫొటో షూట్లు చేశారు. ఈ క్రమంలో మంచు మనోజ్ మెగా హీరోలతో కలిసి సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

అయితే మనోజ్(Manchu Manoj) కొన్ని డేస్ నుంచి మంచు ఫ్యామిలీతో గొడవలు అవుతోన్న విషయం తెలిసిందే. కాగా సినిమాలకు కూడా దూరంగా ఉంటున్నారని సమాచారం. రీసెంట్ గానే పలు షోలు, మూవీలతో కంబ్యాక్ ఇస్తున్నారు. అయితే పండగ వేళ ఈ హీరో అండ్ తన భార్య మౌనిక, కొడుకు, కూతురుతో కలిసి మెగా హీరోలతో కనిపించారు.

వీరితో పాటు ఈ పిక్‌లో సీనియర్ నటుడు నరేష్(Senior actor Naresh) కుమారుడు విజయ్ కృష్ణ(Vijay Krishna), సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej), పంజా వైష్ణవ్ తేజ్(Panja Vaishnav Tej) పలువురు ఉన్నారు. ఇక సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్, విజయ్ కృష్ణ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. కానీ జనాలు తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ.. పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మంచు మనోజ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. 

Tags:    

Similar News