Sitara: ఆకట్టుకుంటోన్న సూపర్‌స్టార్ మహేష్ బాబు గారాల పట్టి ఫొటో షూట్..!
టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు(Tollywood senior hero superstar Mahesh Babu) గారాల పట్టి సితార (Sitara) క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ అమ్మడు తరచూ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. వెకేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, తన డ్యాన్స్ వీడియోలు నెట్టింట షేర్ చేసి.. ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉంటుంది. సితారకు ఈ ఏజ్‌లోనే హీరోయిన్ లెవల్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం గమనార్హం. తండ్రికి తగ్గ కూతురిగా గుర్తింపు సొంతం చేసుకుంటోంది. సితార ఇప్పటికే మహేష్ బాబు సినిమాలో తండ్రితో కలిసి ఓ పాటకు స్టెప్పులేసిన విషయం తెలిసిందే.
ఓ ఇంటర్వ్వ్యూలో నమ్రతకు సితార సినీ ఎంట్రీ గురించి ప్రశ్న కూడా ఎదురైంది. నటనపై తనకు ఇంట్రెస్ట్ ఉందని నమ్రత చెప్పడంతో సూపర్ స్టార్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే సితార నిన్న సంక్రాంతి సందర్భంగా ఓ అదిరిపోయే ఫొటో షూట్ చేసింది. పింక్ కలర్ లెహంగా ధరించి.. సింపుల్ లుక్‌లో జనాల్ని ఆకట్టుకుంటోంది. సితార వెనకున్న అన్ని దేవుళ్ల ఫొటో అందరినీ మరింత ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఘట్టమనేని గారాల పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.