Rajinikanth: రజినీకాంత్ అభిమానులకు సూపర్ న్యూస్.. ‘జైలర్-2’ అదిరిపోయే అప్డేట్ విడుదల

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) 70 ఏళ్లు దాటినప్పటికీ వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు.

Update: 2025-01-14 13:59 GMT
Rajinikanth: రజినీకాంత్ అభిమానులకు సూపర్ న్యూస్.. ‘జైలర్-2’ అదిరిపోయే అప్డేట్ విడుదల
  • whatsapp icon

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) 70 ఏళ్లు దాటినప్పటికీ వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. రజినీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilip Kumar) కాంబోలో ‘జైలర్-2’(Jailer-2) మూవీ రాబోతున్న తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ‘జైలర్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. అయితే ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. జైలర్-2 నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప మరే అప్డేట్ రాలేదు. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా, సంక్రాంతి సందర్భంగా జైలర్-2 టీజర్‌ను విడుదల చేసి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు. ఇందులో అనిరుధ్(Anirudh), నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా గురించి చర్చించుకుంటుండగా.. రజినీకాంత్(Rajinikanth) ఎంట్రీ విలన్స్‌ను చంపుతూ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టారు. కత్తిపట్టుకుని వచ్చిన ఆయన రక్తం కారుతుండగా.. పట్టుకెళ్తారు. బయటకు వెళ్తూ బాంబ్‌ను అక్కడే వదిలేసి వెళ్లడంతో అది పేలి అనిరుధ్, నెల్సన్‌కు గాయాలవుతాయి. ఆ తర్వాత బాంబులతో కార్లను పేల్చేయడంతో మంటలు వస్తుండగా.. అందులోంచి రజినీకాంత్ వస్తున్నట్లు చూపించారు. ప్రస్తుతం జైలర్ ఎలివేషన్స్ అభిమానులను ఫిదా అయ్యేలా చేస్తున్నాయి.


Full View

Tags:    

Similar News