ప్రేమతో ఈ కొత్త సంవత్సరం.. ‘రాపో-22’ సినిమా అప్డేట్‌కు టైమ్ ఫిక్స్.. పోస్ట్ వైరల్

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని రీసెంట్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Update: 2024-12-31 07:12 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని రీసెంట్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్నంత హిట్ మాత్రం కాలేదు. ప్రస్తుతం రామ్ ‘రాపో-22’ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి ‘మిస్ శెట్టి మిస్టర్ శెట్టి’ ఫేమ్ పీ మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ రాబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

జనవరి 1, 2025 ఉదయం 10.45 నిమిషాలకు రాబోతున్నట్లు తెలిపారు. అలాగే ప్రేమతో ఈ కొత్త సంవత్సరం అనే క్యాప్షన్‌ను జోడించారు. అంతే కాకుండా హీరో, హీరోయిన్ వర్షంలో తడుస్తూ ఉండగా హీరో తన ప్రేయసి చున్నితో కప్పుకున్నట్లుగా ఉన్న ఫొటోను షేర్ చేశారు. అయితే ఈ పిక్ బ్లాక్ అండ్ వైట్ కలర్‌ ఉండటం విశేషం. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన రామ్ పోతినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు

 

Tags:    

Similar News