'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' నుంచి థర్డ్ సింగిల్ వచ్చేది అప్పుడే.. నెట్టింట క్యూరియాసిటీ పెంచుతున్న పోస్ట్
బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju), జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి(Deepika pilli) జంటగా నటిస్తోన్న సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbai).

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju), జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి(Deepika pilli) జంటగా నటిస్తోన్న సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbai). ఇక ఈ చిత్రాన్ని నితిన్(Nithin), భరత్(Bharath)లు తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకుని సినిమాపై మరింత హైప్ పెంచాయి. . ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలోని థర్డ్ సింగిల్‌కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ‘మొదటి చినుకు సాంగ్ మార్చి 20 ఉదయం 11 గంటలకు రాబోతున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ హాట్ సమ్మర్‌లో కూల్ మెలోడి మీ కోసమే’ అంటూ రాసుకొచ్చారు.
ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లి మట్టిలో చినుకు పడుతున్న దానిని నవ్వుతూ చూస్తున్నారు. అయితే వీరిద్దరు కూడా ట్రెడిషనల్ వేర్‌లో ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
Read More..
స్టేజ్‌పైనే నటుడిని హగ్ చేసుకున్న ఫ్యాన్ గర్ల్.. హీరో ఫ్రెండ్ ఏమని కామెంట్ చేశాడంటే?