Varun Sandesh: క్యూరియాసిటీ పెంచుతున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘కానిస్టేబుల్’ మూవీ టీజర్
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్(Varun Sandesh) ‘హ్యపీ డేస్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పలు మూవీస్‌లో నటించి మెప్పించారు.
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్(Varun Sandesh) ‘హ్యపీ డేస్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పలు మూవీస్‌లో నటించి మెప్పించారు. పెద్దగా ఫేమ్ రాకపోవడంతో ఆయన 2022 తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. మళ్లీ ‘నింద’(Nindha) చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. అంతేకాకుండా పలు రికార్డులు సాధించి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ నటిస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘కానిస్టేబుల్’(Constable). ఆర్యన్ సుభాన్ ఎస్‌కే(Aryan Subhan SK) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్‌పై బలగం జగదీష్(Jagadish) నిర్మిస్తున్నారు.
ఇందులో మధులిక వారణాసి(Madhulika Varanasi) హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా, ‘కానిస్టేబుల్’ మూవీ టీజర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. దీనిని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథనక్కిన చేతుల మీదుగా లాంచ్ చేయించారు. ఈ టీజర్‌లో కవరుణ్ క్రైమ్ చేసిన నిందితులను చేధించి పట్టుకుని చితకబాదుతాడు. చివరగా.. ఓ మాస్క్ తీసుకుంటున్నగా చూపించడంతో పాటు కత్తిపోటు వల్ల రక్తం కారుతున్న బాడీని చూపించి క్యూరియాసిటీని పెంచారు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.
(Video Credit to Constable Telugu Teaser -Divo Music YouTube Channel)
Read More...
‘తండేల్’ నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. ఉగ్రరూపంలో చైతు, సాయిపల్లవి మాస్ స్టెప్స్