Sankranthiki Vasthunam: మరో అద్భుతమైన పాట రాబోతుంది.. సెకండ్ సింగిల్‌పై అప్‌డేట్

విక్టరీ వెంకటేష్(Venkatesh), డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో రాబోతున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’

Update: 2024-12-17 13:38 GMT

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్(Venkatesh), డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో రాబోతున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam). ఇందులో నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. ఫస్ట్ సింగిల్ ‘గోదారి గట్టు మీద రామ సిలకవే’ సాంగ్ సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే తాజాగా సెకండ్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు అనిల్ రావిపూడి.

‘మా ‘గోదారిగట్టు’ సాంగ్‌కు ఇంత అద్భుతంగా స్పందించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మేము ఇప్పుడు మీ అందరి కోసం బ్రదర్ భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన మరో అద్భుతమైన పాటను అందిస్తున్నాము. రెండవ సింగిల్ ‘మీనూ’ డిసెంబర్ 19న మీ ముందుకు రాబోతుంది’ అంటూ తెలిపాడు. కాగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) బ్యానర్‌పై దిల్ రాజు(Dil Raju ), శిరీష్ (Sirish) నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం 2025 సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 14న ప్రపంపవ్యాప్తంగా ప్రేక్షకుల గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

Tags:    

Similar News