హిందీలో విడుదల కానున్న రూ.100 కోట్ల సినిమా.. రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే..

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) నటించిన ‘అఆ’(A AA) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2025-03-10 02:33 GMT
హిందీలో విడుదల కానున్న రూ.100 కోట్ల సినిమా.. రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే..
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) నటించిన ‘అఆ’(A AA) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘టిల్లు స్క్వేర్’(Tillu Square) మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మనుపెన్నడు కనిపించని గ్లామర్ ట్రీట్‌తో కుర్రాళ్లును ఫిదా చేసింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’(JSK), ‘పరదా’(Paradha) వంటి సినిమాలు ఉన్నాయి.

అయితే రీసెంట్‌గా ‘డ్రాగన్’ మూవీతో మనముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో తమిళ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరోగా నటించాడు. అలాగే కయాద్ లోహర్ కూడా హీరోయిన్‌గా నటించింది. ఇక దీనికి ‘ఓ మై కడవులే’ ఫేమ్ అశ్వత్ మరి ముత్తు(Ashwath Marimuthu) దర్శకత్వం వహించారు. అయితే దీనిని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కల్పాతి ఎస్. అఘోరమ్(Kalpathi S.Aghoram), కల్పాతి ఎస్. గణేష్(Kalpathi S.Ganesh), కల్పాతి ఎస్. సురేష్(Kalpathi S.Suresh) ఈ చిత్రాన్ని నిర్మించారు.

అయితే డ్రాగన్ సినిమా ఫిబ్రవరి 21న తమిళం, తెలుగు, మలయాళం వంటి భాషల్లో విడుదలైంది. దాదాపు 10 రోజుల్లోనే 100 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా.. ఇప్పుడు హిందీలో విడుదల కానుంది. తమిళ, తెలుగు ఇండస్ట్రీలో విజయం సాధించిన తర్వాత, ఈ సినిమా ఇప్పుడు మార్చి 14న బాలీవుడ్‌లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags:    

Similar News