ఓటీటీలోకి వచ్చేస్తున్న పాన్ ఇండియా మూవీ ‘అగత్యా’.. స్ట్రీమింగ్ డేట్‌పై అధికారిక ప్రకటన విడుదల
కోలీవుడ్ హీరో జీవా(Jiva), అర్జున్ (Arjun)కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘అగత్యా’(Aghathiyaa).

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో జీవా(Jiva), అర్జున్ (Arjun)కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘అగత్యా’(Aghathiyaa). హిస్టారికల్ థ్రిల్లర్ సినిమాలో రాశీఖన్నా(Raashi Khanna) హీరోయిన్‌గా నటించగా.. యోగిబాబు(Yogi Babu), అభిరామి(Abhirami), రోహిణి, మటిల్డా, రాధా రవి, పూర్ణిమ భాగ్యరాజ్, సెంథిల్, చార్లే, ఢిల్లీ గణేష్ ప్రధాన పాత్రలో కనిపించారు. అయితే ఈ చిత్రాన్ని వెల్స్ ఫిల్మ్ ఇంటర్‌నేషనల్, వామ్ మీడియా బ్యానర్స్‌పై ఇషారి కె. గణేష్, అనీష్ అర్జున్ దేవ్ నిర్మించగా.. పా. విజయ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రావు సంగీతం అందించారు.
అయితే ‘అగత్యా’మూవీ ఫిబ్రవరి 28న థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కానీ హిట్ సాధించలేకపోయింది. తాజాగా, ‘అగత్యా’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ సన్ నెక్ట్స్ సొంతం చేసుకోగా.. మార్చి 28న స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కానీ ఏయో భాషల్లో అందుబాటులోకి రానుందనేది మాత్రం ప్రకటించలేదు.