HYDలో మరో సంచలనం.. షాప్ ఓపెనింగ్‌కు వచ్చిన బాలీవుడ్‌ నటిపై అత్యాచారయత్నం

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌(Hyderabad)లో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హైదరాబాద్‌కు వచ్చిన బాలీవుడ్ నటి(Bollywood Actress)పై గుర్తుతెలియని యువకులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు.

Update: 2025-03-24 09:20 GMT
HYDలో మరో సంచలనం.. షాప్ ఓపెనింగ్‌కు వచ్చిన బాలీవుడ్‌ నటిపై అత్యాచారయత్నం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌(Hyderabad)లో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హైదరాబాద్‌కు వచ్చిన బాలీవుడ్ నటి(Bollywood Actress)పై గుర్తుతెలియని యువకులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఈనెల 18న ఓ షాప్ ఓపెనింగ్ నిమిత్తం హైదరాబాద్‌కు బాలీవుడ్ నటి వచ్చింది. మాసబ్‌ట్యాంక్(Masab Tank) సమీపంలోని శ్యామ్‌నగర్‌ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రాత్రి స్టే చేసింది. అదేరోజు రాత్రి ఇద్దరు గుర్తు తెలియని యువకులు ఆమె రూమ్‌లోకి చొరబడ్డారు. తమకు సహకరించాలని ఒత్తిడి చేశారు. ఎక్కడ పడితే అక్కడ తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు.

ఈ క్రమంలోనే ఆమె నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం(Sexual Assault) చేసేందుకు ప్రయత్నించారు. దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో కాళ్ళు చేతులు కట్టేసి ఆమె బ్యాగులో నుండి నగదు, బంగారం తీసుకొని పారిపోయారు. దీంతో భయాందోళనకు చెందిన నటి హుటాహుటిన పోలీసులకు సమాచారం ఇచ్చి.. కంప్లైంట్ చేసింది. నటి ఫిర్యాదు మేరకు పోలీసులు(HYD Hyderabad) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన స్నేహితురాలి కావడంతోనే నటి హైదరాబాద్‌కు వచ్చిందని పోలీసులు నిర్ధారించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, కొన్ని గొంటల క్రితమే సికింద్రాబాద్‌లోని ఎమ్ఎమ్‌టీఎస్ ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం జరిగింది. రైలు బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బాధితురాలు రైలు నుంచి బయటకు దూకింది. ప్రస్తుతం సదరు యువతి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇది చోటుచేసుకున్న కాసేపటికే బాలీవుడ్ నటి ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.

Tags:    

Similar News