‘విశ్వంభర’రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ పండుగకు సందడి చేసేందుకు వచ్చేస్తున్న మెగాస్టార్!

మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) అందరికీ సుపరిచితమే. ఆయన ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఎంతో మంది అభిమానులను దక్కించుకున్నారు.

Update: 2025-03-24 08:49 GMT
‘విశ్వంభర’రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ పండుగకు సందడి చేసేందుకు వచ్చేస్తున్న మెగాస్టార్!
  • whatsapp icon

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) అందరికీ సుపరిచితమే. ఆయన ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఎంతో మంది అభిమానులను దక్కించుకున్నారు. అయితే చిరు కోసం చాలామంది చనిపోతారనడంలో అతిశయోక్తి లేదు. ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు పోటినిస్తున్నారు. ఆయన ఇటీవల ‘వాల్తేరు వీరయ్య’మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘విశ్వంభర’(Vishvambhara).

వశిష్ట (Vasishta)దర్శకత్వంలో రాబోతుండగా.. దీనిని యూవీ క్రియేషన్స్(UV Creations) బ్యానర్‌పై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి(Vikram Reddy) నిర్మిస్తున్నారు. అయితే ఇందులో చిరంజీవి సరసన స్టార్ బ్యూటీ త్రిష (trisha) హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే అషికా రంగనాథ్(Ashika Ranganath), మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదాలు పడుతూ వస్తోంది.

అయితే గత కొద్ది రోజుల నుంచి ‘విశ్వంభర’ మూవీకి సంబంధించిన అప్డేట్స్ రాకపోవడంతో ఎప్పుడెప్పుడు వస్తాయా అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ‘విశ్వంభర’మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా వినాయక చవితి కానుకగా ఆగస్టు 22న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. అది చూసిన మెగా అభిమానులు ఆనందపడుతున్నారు.

Tags:    

Similar News