అభిమానులకు గుడ్ న్యూస్.. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ వచ్చేది ఆ స్పెషల్ డే నాడే! (ట్వీట్)

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) గత ఏడాది ‘దేవర’ (Devara: Part 1) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Update: 2025-03-31 12:47 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) గత ఏడాది ‘దేవర’ (Devara: Part 1) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జాన్వీ కపూర్ (Janvi Kapoor)హీరోయిన్‌గా నటించిన ఆ సినిమా కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మించారు. సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్స్‌లోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్(Prashant Neel) దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఓ భారీ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది.

దీనిని మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers), ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేనీ, యలమంచలి రవిశంకర్, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం పూర్తి కాగా.. షూటింగ్ కూడా మొదలై శరవేగంగా జరుగుతోంది. కానీ అప్డేట్స్ మాత్రం విడుదల కాలేదు. దీంతో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, సోషల్ మీడియాలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతున్నట్లు ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ మే 20న తారక్ పుట్టినరోజు కానుకగా విడుదల కాబోతున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ పోస్ట్ చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Tags:    

Similar News

Sandeepa Dhar