ఇది బొమ్మరిల్లు కథ కాదు రక్త చరిత్ర.. హైప్ పెంచుతున్న ‘ఓ భామ అయ్యే రామ’ టీజర్
టాలీవుడ్ నటుడు సుహాస్ (suhas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘కలర్ ఫొటో’ సినిమాతో హీరోగా మారిన ఆయన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు సుహాస్ (suhas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘కలర్ ఫొటో’ సినిమాతో హీరోగా మారిన ఆయన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దీంతో వరుస మూవీస్ చేస్తూ తన క్రేజ్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. డిఫరెంట్ స్టోరీలతో వచ్చి జనాలు మెప్పిస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం సుహాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓ భామ అయ్యో రామ’( oh bhama ayyo rama). ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో మలయాళ బ్యూటీ మాళవిక మనోజ్ (malavika manoj) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమాకు రామ్ గోధల (ram godhala)దర్శకత్వం వహిస్తున్నారు.
ఇందులో రవీందర్ విజయ్ (ravinder vijay), అనితా హస్పానందని, బబ్లూ పృథ్వీరాజ్, అలీ(ali), కీలక పాత్రలో కనిపించనున్నారు. దీనిని హరీష్ నల్ల నిర్మాణ బాధ్యతలు వహించగా.. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యానర్‌పై రాబోతుంది. ఇక ఈ సినిమాకు రాధనం సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘ఓ భామ అయ్యో రామ’మూవీకి సంబంధించిన పోస్టర్స్ అందరీలో క్యూరియాసిటీని పెంచాయి. ఇక తాజాగా, ‘ఓ భామ అయ్యో రామ’చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో హీరోయిన్ మన కథ బొమ్మరిల్లు కాదు.. రక్త చరిత్ర అని చెప్పిన డైలాగ్ అందరిలో హైప్ పెంచుతోంది. అలాగే సుహాస్ అమ్మాయిలను నమ్మొద్దు అని అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు.