Bigg Boss: బిగ్ బాస్ మధ్యలోనే హౌస్ నుండి బయటికి వచ్చేసిన నటి

బిగ్ బాస్ షో ( Bigg Boss) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2024-12-03 09:29 GMT

దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ షో ( Bigg Boss) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో కార్తీకదీపం ( Karthika Deepam) సీరియల్ తో మంచి గుర్తింపు పొందిన శోభా శెట్టి ( Shobha Shetty) తెలుగు బిగ్ బాస్ కి కూడా వెళ్ళింది. అయితే, ఈ ముద్దుగుమ్మ కన్నడ బిగ్ బాస్ కి కూడా వెళ్ళింది. ఇక్కడైనా కప్ కొడదామని వెళ్ళింది.. కానీ, ఎవరు ఊహించని విధంగా మధ్యలోనే బయటికి వచ్చేసింది.

అయితే, తాజాగా ఈ బ్యూటీ బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక ఓ పోస్ట్ పెట్టింది.. " నా బిగ్ బాస్ ప్రయాణం ఇక్కడితో ముగిసింది. బాగా ఆడాలని ఇంట్లోకి వెళ్ళాను. కానీ, ఆరోగ్యం సహకరించడం లేదు, ముందుకెళ్లాలని ఉన్నా శరీరం సహకరించడం లేదు.. నేను దేనిని తేలికగా తీసుకోలేను, జీవిత బాధ్యతల కోసం ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు నాపై చూపిన ప్రేమ, సపోర్ట్ కి నేను థాంక్స్ తెలుపుతున్నాను. నేను ఎవరినైనా బాధపెట్టి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. మీ ప్రేమను తిరిగి పొందడానికి త్వరలోనే మీ ముందుకు వస్తాను’ అంటూ పోస్ట్ లో శోభా శెట్టి రాసుకొచ్చింది. 

Tags:    

Similar News