OTT: ఓటీటీలోకి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
మలయాళ (Malayalam) నటుడు కుంచకో బోబన్ ప్రధాన పాత్ర పోషించిన లేటెస్ట్ మూవీ ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’
దిశ, సినిమా: మలయాళ (Malayalam) నటుడు కుంచకో బోబన్ ప్రధాన పాత్ర పోషించిన లేటెస్ట్ మూవీ ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ (Officer on duty). క్రైమ్ థ్రిల్లర్ (Crime thriller) బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 20న రిలీజై మలయాళంలో మంచి హిట్ సొంతం చేసుకుంది. దీంతో ‘ఆఫీసర్ ఆన డ్యూటీ’ మూవీని తెలుగులో ఈనెల 14న విడుదల చేశారు. కానీ, ఇక్కడ అంతగా సక్సెస్ అందుకోలేదు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్(Release)కు సిద్ధం అయింది. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ (Digital streaming) హక్కలను ప్రముఖ ఓటీటీ (OTT) సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. ఈనెల 20 నుంచి మలయాళంతో పాటు తెలుగు (Telugu), తమిళం (Tamil), కన్నడ (Kannada), హిందీ (Hindi) భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. కాగా.. జితూ అష్రఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియమని, జగదీశ్, విశాఖ నాయర్, ఆడుకాలం నరేన్, విష్ణు వారియర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ గోల్డ్ చైన్ దొంగతనం, ఓ అమ్మాయి చావు, ఓ పోలీస్ ఆత్మహత్య చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. అడుగడుగునా ట్విస్టులతో సాగిన ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్‌గా బోబన్ పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి.
Read More..
పబ్లిక్‌లో రెచ్చిపోయిన హాట్ యాంకర్.. అసలు ఆ అభిమాని ఏం అన్నాడో తెలుసా?