బాగా మిస్ అవుతున్నానంటూ మెగా బ్యూటీ పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే..
యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఇచట వాహనాలు నిలుపరాదు’(Ichata Vahanalu Nilaparadhu) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. అతి తక్కువ టైంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. రీసెంట్‌గా మీనాక్షి టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అనిల్ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కించిన ఈ మూవీలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) కూడా నటించారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అలా ఓ పక్క సినిమాలతో మరోపక్క నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ మీనాక్షి తన లేటెస్ట్ ఫొటోస్‌లతో పాటు వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా ఈ భామ ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టింది. అందులో ట్రావెన్ కౌర్‌తో చాలా సన్నిహితంగా ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే.. నీకు ఈ సంవత్సరం బెస్ట్ ఇయర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిస్ యూ’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు మేము నిన్ను మిస్ అవుతున్నామని కామెంట్స్ చేస్తున్నారు.

READ MORE ...
వెల్ కమ్ టు ద వరల్డ్ అంటూ చిట్టి తల్లికి స్వాగతం పలికిన మెగా డాటర్.. షాక్‌లో ఫ్యాన్స్