బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన మహేష్ బాబు తనయుడు.. అస్సలు ఊహించలేదు సూపర్ అంటున్న నెటిజన్లు (వీడియో)

గత కొద్ది రోజుల నుంచి స్టార్ కిడ్స్ అంతా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తూ తమ నటనతో సత్తా చాటుతున్నారు.

Update: 2025-03-21 06:34 GMT
బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన మహేష్ బాబు తనయుడు.. అస్సలు ఊహించలేదు సూపర్ అంటున్న నెటిజన్లు (వీడియో)
  • whatsapp icon

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి స్టార్ కిడ్స్ అంతా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తూ తమ నటనతో సత్తా చాటుతున్నారు. కొంతమంది తమ సొంత టాలెంట్‌తో వచ్చి బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తున్నారనడంతో అతిశయోక్తి లేదు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) తనయుడు గౌతమ్(Gautam) సినీ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన గతంలో ‘వన్ నేనొక్కడినే’( Nenokkadine)మూవీలో నటించాడు. అయితే ఇప్పుడు న్యూయార్క్‌లో యాక్టింగ్ నేర్చుకుంటున్న విషయం తెలిసిందే.

టిస్క్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో యాక్టింగ్ కోర్ట్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆయన సినీ ఎంట్రీ కోసం అంతా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా, గౌతమ్ సూపర్ స్టార్ అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. యాక్టింగ్ పూర్తి కాకుండానే ఓ వీడియో చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక అది చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతే సూపర్ తండ్రికి తగ్గ తనయుడు అని తెగ పొగిడేస్తున్నారు.

Tags:    

Similar News