వెల్ కమ్ టు ద వరల్డ్ అంటూ చిట్టి తల్లికి స్వాగతం పలికిన మెగా డాటర్.. షాక్‌లో ఫ్యాన్స్
మెగా డాటర్ నిహారిక కొణిదెల(NIHARIKA KONIDELA) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది.

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక కొణిదెల(NIHARIKA KONIDELA) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. కానీ అనుకున్నంతగా విజయం సాధించలేదు. దీంతో నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నది. అలా ఫస్ట్‌గా తీసిన మూవీ ‘కమిటి కుర్రోళ్లు’(Comittee Kurrollu). తన ఫస్ట్ చిత్రంతోనే బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. దీంతో ప్రొడ్యూసర్‌గా సక్సెస్ అయింది. ప్రస్తుతం రెండు మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తుంది.
ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. నిహారిక చైతన్య జొన్నలగడ్డ(Chaitanya Jonnalagadda) అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది. కానీ పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకుంది. ప్రస్తుతం తమ తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. అలాగే నిత్యం ఫ్రెండ్స్‌తో వేకెషన్స్‌కు వెళుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. వాటిని సోషల్ మీడియా(Social Media) వేదికగా పంచుకుంటూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
తాజాగా నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ స్టోరీ పెట్టింది. అందులో..’ ఈ కొత్త ప్రపంచంలోకి నిన్న ఆహ్వానిస్తున్నాము చిన్నారి పాప.. మా మహాతల్లి ఓ బుజ్జితల్లికి జన్మనిచ్చింది’ (వెల్‌కమ్ టు ద వరల్డ్ బేబీ గర్ల్ అవర్ మహాతల్లి గేవ్ అస్ ఎ బుజ్జి తల్లి తల్లి) అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దాన్ని చూసిన నెటిజన్లు సడెన్‌గా చూసి నీకు పాప పుట్టిందేమో అని షాకయ్యాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

READ MORE ...
రష్మికతో మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యా.. యంగ్ బ్యూటీ సంచలన కామెంట్స్