పెళ్లి కూతురు అంటూ శోభిత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. అందానికి అందమే ఈ పుత్తడి బొమ్మ అంటున్న నెటిజన్లు

అక్కినేని నాగచైతన్య సమంతతో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో డేటింగ్‌లో ఉంటూ రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2024-12-02 08:23 GMT

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య సమంతతో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో డేటింగ్‌లో ఉంటూ రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి పెళ్లి పనులు ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ఇందులో భాగంగా రీసెంట్ నాగ చైతన్య- శోభిత ధూళిపాళల మంగళ స్నానాలు కూడా షురూ అయ్యాయి. ఇక హల్దీ ఫంక్షన్ ఫొటోలను శోభిత తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేయండంతో ఈ ఫొటోలు కాస్త వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో ఈ అమ్మడు పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా చైతన్య- శోభితల పెళ్లి డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో అంగరంగ వైభవంగా జరగనునన్నట్లు సమాచారం.

తాజాగా శోభిత ధూళిపాళ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో రెడ్ కలర్ శారీ కట్టుకొని ఒంటి నిండా నగలు వేసుకొని రెడీ అయ్యింది. అంతేకాకుండా ఈ పిక్స్‌కు 'పెళ్లి కూతురు' అనే క్యాప్షన్‌ను జోడించింది. దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు ‘అందానికి అందమే ఈ పుత్తడి బొమ్మ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు శోభిత పెళ్లి కూతురులా రెడీ అయిన ఫొటోలను చూసేయండి.

Tags:    

Similar News