Silk Smitha: సిల్క్ స్మిత జీవిత కథ నుంచి గ్లింప్స్ విడుదల..!
అప్పట్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది దివంగత నటి సిల్క్ స్మిత.
దిశ, వెబ్‌డెస్క్: అప్పట్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది దివంగత నటి సిల్క్ స్మిత(Actress Silk Smitha). ఈమె జీవితం ఆధారంగా ‘సిల్క్ స్మిత-ది క్వీన్ ఆఫ్ సౌత్’ (Silk Smitha-The Queen of South) అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు నూతన డైరెక్టర్ జయరామ్(Director Jayaram) దర్శకత్వం వహిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ ఫిల్మ్ లో సిల్క్ స్మిత పాత్రలో చంద్రికా రవి నటించబోతున్నారు.
అయితే తాజాగా ఈ బయోపిక్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ.. గ్లింప్స్ విడుదల చేసింది చిత్రబృందం. సిల్క్ స్మిత బయోపిక్ మూవీ నుంచి రిలీజైన గ్లింప్స్‌కు ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. అలనాటి అందాల తార దివంగత సిల్క్ స్మిత 1980, 1990 దశకాల్లో భారత సినీ పరిశ్రమలో ఈమె పేరు మారుమోగింది. సినిమాల్లో స్పెషల్ పాటలకు కేరాఫ్‍గా అడ్రస్‌గా నిలిచింది. సినీ ఇండస్ట్రీలో మంచి డ్యాన్సర్‌గా పేరు దక్కించుకుంది. తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో సుమారు 400 సినిమాల్లో నటించారు. అప్పట్లో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉండేది. సిల్క్ స్మిత జీవితం కూడా ఓ మిస్టరీనే. 1996 సెప్టెంబర్ 23న ఆమె హఠాత్తుగా మరణించారు.