Sai Pallavi: వారితో స్పెషల్ ట్రిప్ అంటూ సాయి పల్లవి పోస్ట్

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

Update: 2024-12-22 02:34 GMT

దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇందులో ఆమె నటన అందంతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, లవ్‌స్టోరి(Love Story), mca వంటి చిత్రాలతో తన క్రేజ్‌ను పెంచుకుంది. ఈ ఏడాది తమిళంలో శివకార్తికేయన్(Sivakarthikeyan) సరసన ‘అమరన్’(Amaran) సినిమాలో నటించింది. అయితే ఇది దీపావళి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం సాయి పల్లవి ‘తండేల్’(Thandel) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న థియేటర్స్‌లో విడుదల కానుంది. చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, సాయి పల్లవి ఓ ట్రిప్‌కు వెళ్లింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ పెట్టింది. తన చెల్లి, ఫ్రెండ్‌తో కలిసి ఆస్ట్రేలియా(Australia) వెకేషన్‌కు వెళ్లింది. ఈ ఫొటోలను షేర్ చేస్తూ ‘‘స్పెషల్ ట్రిప్. మనోహరమైన వ్యక్తులు, అడ్వెంచర్, లాఫ్టర్’’ అనే క్యాప్షన్ జత చేసింది. 

Tags:    

Similar News