‘అలాంటి వాటిని నేను అస్సలు పట్టించుకోను’.. సుహాస్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సంకీర్తనా విపిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సంకీర్తనా విపిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఆ తర్వాత వెండితెరపై సందడి చేసింది. అలా ‘నరకాసుర’ అనే మూవీతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా అంతగా హిట్ కాలేదు. కానీ, ఈ భామ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో వరుస ఆఫర్లు వచ్చాయి. ‘ఆపరేషన్ రావణ్’, ‘జనక అయితే గనక’ వంటి సినిమాల్లో నటించింది. అయితే బాగా ఫేమ్ తెచ్చుకుంది మాత్రం సుహాస్ నటించిన ‘జనక అయితే గనక’ అనే మూవీతోనే. ఇందులో ఈ భామ ‘ఏమైనా అయితే మా ఆయన చూసుకుంటాడు’ అని చెప్పే డైలాగ్ ఇంకా ఫేమస్ అయింది.
ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంకీర్తనా మాట్లాడుతూ.. ‘నా సినిమా ప్లాప్ అయిన ప్రతీసారి ఇది నీకు సెట్ కాదు. వేరే ప్రొఫెషన్ చూసుకో అంటూ చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి. నేను వారు చెప్పినట్టు విని సినిమాలు చేయడం మానేస్తాను అని వాళ్ళు అనుకుంటారు. బట్ అలాంటి నెగెటివ్ కామెంట్స్‌ను నేను అస్సలు పట్టించుకోను. అండ్ అలాంటి మాటలతో వెనక్కిలాగే ప్రయత్నం చేసేవాళ్లని కూడా పట్టించుకోను అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.